నౌకదళంలో చేరిన ఐఎన్‌ఎన్‌ సహ్యద్రి

మంబాయి: దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక యుద్ధనౌక ఐఎన్‌ఎన్‌ సహ్యాద్రి..నౌకదళంలో చేరింది. దీతో మన జలాంతర్గామి విధ్వంసక పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఈ యుద్ధనౌకను నౌకదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకదళాధిపతి అడ్మిరల్‌ నిర్మల్‌ వర్మ, ఇతర సీనియర్‌ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
స్టెల్‌ యుద్ధనౌకల తరగతిలో సహ్యాద్రి చివరిది. ఇప్పటికే ఎన్‌ఎన్‌ శివాలిక్‌, ఐఎన్‌ఎన్‌ సాత్పురాలు నౌకదళంలో చేరాయి. ఇవి హిందూ మహాసముద్ర ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నాయి. 4,900టన్నుల బరువున్న ఐఎన్‌ఎన్‌ సహ్యాద్రిలో అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి. ఇది రెండు హెలికాప్టర్లను మోసకెళ్లగలదు. ఈ యుద్ధనౌకకు శత్రుదేశపు యుద్ధనౌకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉంది. దీనికితోడు శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయడానికి అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్‌ఫెర్‌ సామర్థ్యం, టోర్పెడోలు ఉన్నాయి. సముద్ర లోతుల్లో శత్రువు కదలికలను గమనించేందుకు అత్యాధునిక సోనార్‌, రాడార్‌ వ్యవస్థలు ఉంటాయి. ఇది బ్రహ్మూెస్‌నౌక విధ్వంసక క్రూయిజ్‌ క్షిపణిని కూడా తీసుకెళుతుంది. సహ్యాద్రికి స్టెల్త్‌ సామర్థ్యం ఉంది. దీనివల్ల శత్రు ఎలక్ట్రానిక్‌ సెన్సర్లకు దీని ఆచూకీ దొరకదు. ముంబాయిలోని మజగాప్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌..ఈ యుద్ధనౌకను నిర్మించింది. దీని నిర్మాణం 2003 మార్చిలో ప్రారంభమైంది. గత ఏడాది దీన్ని సముద్ర పరీక్షలకు తీసుకెళ్లారు. సహ్యాద్రిలో 250 మంది సిబ్బంది ఉంటారు. ఈ యుద్ధనౌక ఖరీదు సుమారు రూ. 2200కోట్లు ఈ సందర్భంగా ఆంటోనీ మాట్లాడుతూ ఈ యుద్ధనౌక ప్రవేశం మన సముద్ర సంబంధ లక్ష్యాలను సాధించే దిశగా మరో ముందడుగని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతను పెంపొందించడంలో భారత నౌకదళం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు-17కింద ఈ మూడు యుద్ధనౌకలనఱు నిర్మించారు. ఇప్పుడు ప్రాజెక్టు-17ఏ కింద మరో ఏడు నౌకలను నిర్మిస్తామని ఆంటోనీ చెప్పారు.