న్యాయం జరగదని ఓ తండ్రి ఆత్మహత్య

హిసార్‌: హర్యానాలోని హిసార్‌లో కొన్ని దళిత కుటుంబాలు ఈరోజు ఆందోళనకు దిగాయి. పదహారేళ్ల తన కమార్తెపై కొందరు అగ్రవర్ణ దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్త తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అతను ఆత్మహత్య చేసుకోగా నేరం చేసిన వారిని అరెస్టు చేసేవరకు శవాన్ని దహనం చేయబోమంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి, మిగతా వారిని కూడా చేస్తామని నచ్చజెప్పడంతో శాంతించిన గ్రామస్థులు ఈరోజు అంత్యక్రియలు జరిపించారు. సెప్టెంబరు 9న జరిగిన అత్యాచారం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోనులో చిత్రీకరించి దాన్ని అందరికీ చూపుతామని బెదిరించడంతో కొన్నాళ/్ల నిశ్శబ్దంగా ఉన్న యువతి చివరికి తట్టుకోలేక తల్లిదండ్రుల ముందు భోరుమంది. దాంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి గ్రామస్థులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలసికట్టుగా నిలిచి నేరస్థులను అరెస్టు చేసేవరకు వూరుకోలేదు.