న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల  ఎన్నికలపై న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సున్నితమైన అంశాలపై అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బీసీలకు అవకాశాలు తగ్గ కూడదన్నదే కాంగ్రెస్‌ అభిమతమన్న ఆయన, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.