న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను సభ్యులుగా నియమించాలి

న్యూఢిల్లీ: రాష్ట్రా సమాచార కమిషన్లలో న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీఐ-2005లోని 12, 15 (సభ్యుల నియామకానికి సంబంధించిన) నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఏకే పట్నాయాక్‌, స్వతంతర్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ సూచన చేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నమిత్‌ శర్మ ఆర్టీఐ కూడా చట్టానికి సంబంధించినదే కనుక సమాచార కమిషనర్లు సభ్యులుగా నియమితులయ్యే వారికి కూడా న్యాయ నేపథ్యం తప్పనిసరిగా ఉండాలని కోరారు. అయితే, ప్రభుత్వం అతని వాదనను వ్యతిరుకించింది. ఆర్టీఐలో అలాంటి నిబంధనే లేదని పేర్కొంది.