న్యూజిలాండ్‌లో భూకంపం

వెల్లింగ్‌టస్‌ : న్యూజిలాండ్‌ తూర్పుకోస్తా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదయింది. అయితే భూకంప ప్రభావంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారమందలేదు.2011 క్రైస్ట్‌చర్చిలో ఏర్పడిన భూకంపంలో 185 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలసిందే.