న్యూయార్క్‌లో పురాతన భారతీయ కళాఖండాల స్వాధీనం

న్యూయార్క్‌: భారత్‌కు చెందిన పురాతన కళాఖండాలను ఈ రోజు న్యూయార్క్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్‌హట్టన్‌లో సుభాష్‌చంద్రకపూర్‌ అనే భారతీయుడు నిర్వహిస్తున్న మ్యూజియంకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు ఉన్నాయని వీటిని తమిళనాడులోని ఆలయాలనుంచి చోరీ చేశారని తెలియజేశారు. వీటి విలువ 8.5 మిలియన్‌ డాలర్లు ఉంటుందని వారు తెలియజేశారు. కుబేరుని రాతి విగ్రహం, కుషానులకాలంనాటి మరో విగ్రహం, శాక్యముని శాసనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని తమిళనాడు పోలీసులకు అప్పగించనున్నట్లు వారు తెలియజేశారు.