న్యూయార్క్‌ విమానం పేల్చివేతకు కుట్ర?

న్యూయార్క్‌, జూలై 13 : న్యూయార్క్‌ నుంచి స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌కు వెళ్లే డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానం అనుమానాస్పద పరిస్థితులలో శుక్రవారం వెనక్కు వచ్చింది. విమానం టాయిలెట్‌లో కొన్ని వైర్లు కనిపించాయని ఒక యువతి, యువకుడిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. అతడు మధ్య ప్రాచ్యానికి చెందిన వాడని, ఆ యువతి అర్జెంటీనాకు చెందిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. టాయిలెట్‌లో వైర్లు విమానానికి చెందినవి కావని తెలిపారు. విమానం టేకాఫ్‌ చేసిన కొద్ది సమయంలో ఇవి కనిపించినట్టు వెల్లడించారు.