పంచాయితీల్లో కొరవడుతున్న స్వచ్ఛత

share on facebook

వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు

వరంగల్‌,నవంబరు18  (జనం సాక్షి) : పట్టణీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడానికి వీలు లేకుండా పోఓతంది. రోజువారీ వొత్తిళ్లనుంచి కాస్తంత దూరంగా జరిగి విశ్రాంతి తీసుకునే చోటు మిగలలేదు. సమాజ శ్వాసకోశాలుగా పేరుపడ్డ ఉద్యావనాలను పట్టించుకోవడం లేదు. వాటి దుస్థితి తొలగించి తమ ఆయు రారోగ్యాలు కాపాడుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పట్టణాలతో పాటు శివారు పంచాయతీల్లో సైతం కాంక్రీటు భవనాలు లేచిపోతున్నాయి. చెట్టూచేమలూ నరికివేతకు గురై, పొలాలు చదును చేయబడి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతున్నాయి. మహావృక్షాలను మింగుతూ రహదారులు వెడల్పు అయిపోతున్నాయి. ‘పచ్చదనం ఒకప్పుడుండేది’ అనిపించేలా పట్టణంతోపాటు పరిసర పంచాయతీల విస్తరణ శరవేగంగా జరుగుతోంది. పచ్చదనం కూలుతున్నప్పుడల్లా పర్యావరణ ప్రేమికులు ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుండడం తప్ప ఏవిూ చేయలేకపోతున్నారు. పోనీ పంచాయతీ ఉద్యావననాల్లోనైనా పచ్చదనం కనిపిస్తోందా అంటే అదీ లేదు. పంచాయతీల్లో సైతం కాసింత పచ్చదనం కానరావడం లేదు. పాతుకుపోయిన వృక్షాలు ఒకట్రెండు మొండిగా నిలిచి ఉన్నాయి తప్ప అంతకుమించి పచ్చదనం ఈ ఉద్యానవనంలో మచ్చుకు కూడా కనిపించడంలేదు. అసలు ఉద్యావనం రూపే లేకుండా పోయింది. ఎన్ని వన మ¬త్సవాలు, హరితహారం వంటి పథకాలు వచ్చిపోయినా.. ఒక్క మొక్కనాటి నీళ్లు పోసేవారు. లేకుండా పోయారు. పోనీ.. కనీసం పరిశుభ్రంగానైనా పరిసరాలను ఉంచుతున్నారా అంటే అదీ లేదు. ఎక్కడపడితే అక్కడ బాటిళ్లు, రేకులు, పైపులు, ఇరత్రా వ్యర్థాలన్నీ రోడ్డుకు ఇరువైపులా, కాల్వల్లో పడేస్తున్నారు. ఇలా పడేసిన, నిలబెట్టిన వస్తువులు, పాడైపోయిన వాహనాలు, పరికరాలతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఖాళీస్థలాలు డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. చెట్లనుంచి రాలిన చెత్తాచెదారాల కుప్పలు వీటన్నింటితో కలిసి అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్వచ్ఛమైన పచ్చిగాలి పీల్చడం మాటటుంచి అపరిశుభ్ర వాతావరణంతో లేనిపోని రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వ్యర్థాలను తొలగించి పచ్చదనంతో నింపి ఆహ్లాద వాతావరణాన్ని కల్పించాలని పంచాయతీల ప్రజలు కోరుకుంటున్నారు.

Other News

Comments are closed.