పంపిణీ చేస్తుండగా భారాసా నగదు పట్టివేత

చందుర్తి ( జనంసాక్షి):
ఓటింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం ఉండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వివిధ పార్టీల నాయకులు మద్యం, డబ్బుల పంపిణీ తదితర ప్రలోభాలకు తెరలేపారు .ఈ క్రమంలో మండలంలోని లింగంపేట గ్రామంలో నలుగురు వ్యక్తులు డబ్బుల పంపిణీ చేస్తుండగా స్థానికులు (ఎఫ్.ఎస్.టి) ఫ్లయింగ్ స్కాడ్ టీంకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫ్లయింగ్ స్కా డ్ టీం అధికారులు నలుగురు వ్యక్తుల నుండి 71 ,600/- రూపాయలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు . స్వాధీనం చేసుకున్న నగదును, నలుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కాగా భారాసా నాయకులకు చెందిన డబ్బులుగా స్థానికులు పేర్కొంటున్నారు.