పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ.

– నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత.
ఫోటో రైటప్: మొక్కలు నాటుతున్న వైస్ ఎంపీపీ.
బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి)
పచ్చదనం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత అన్నారు. ఆదివారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకై స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వనమహోత్సవం ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డెప్యూటీ రేంజర్ నందిని, సర్పంచ్ కొండ లక్ష్మీ, సింగిల్ విండో వైస్ చైర్మన్ కొయ్యడ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వనిత, టెక్నికల్ అసిస్టెంట్ అశ్విని, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యం, నాయకులు ప్రేమ్ సాగర్ గౌడ్, కొండ అంకులు, బొమ్మేన రాజా గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.