పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సస్పెండ్‌ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి  అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  పట్టాభిని విచారించేందుకు ఏసీబీకి కోర్టు అనుమతినిచ్చింది. విచారణ అనంతరం  పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు అదేశించింది.