పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో సస్పెండ్ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టాభిని విచారించేందుకు ఏసీబీకి కోర్టు అనుమతినిచ్చింది. విచారణ అనంతరం పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు అదేశించింది.