పడవబోల్తా ఇద్దరి మృతి

ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకయ్య వయ్యేరు కాలువపై నాటుపడవ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆకివీడు మండలంలోని కెరటావ గ్రామ శివారున గురువారం ఈ సంఘటన జరిగింది. సంఘటన స్థలాన్ని నర్సాపురం ఆర్డీఓ వసంతరావు, తాశీల్దారు సోమేశ్వర్రావు పరిశీలించారు. భీమవరం రూరల్‌ సీఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.