పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్ లపై

-పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్ లపై-ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల  అవగాహన
ఎస్ఐ శేఖర్ రెడ్డి వినూత్న ఆలోచన ప్రశంసల జల్లు కురిపిస్తున్న మండల ప్రజానీకంవీణవంక మార్చి 27 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్లో సోమవారం ఎస్ఐ  శేఖర్ రెడ్డి పోలీసులు – మీకోసం.* …. కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి  పరీక్ష రాస్తున్న విద్యార్థిని విద్యార్థుల పరీక్ష ప్యాడ్ లపై  ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లైన డయల్ ఫోన్ నంబర్లు   100,181,1098,1930 పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్ల పైన   ముద్రించిన పరీక్ష ప్యాడ్ లతో పాటు, వాటర్ బాటిల్స్, పెన్నులను అందజేశారు. అనంతరం ఎస్ఐ శేఖర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థులు గాని ప్రజలు గాని ఎలాంటి ఎమర్జెన్సీ సమయంలోనైనా డయల్ 100 కు ఫోన్ కాల్ చేసినట్లయితే, తక్షణమే పోలీస్ సహాయం పొందవచ్చన్నారు. ఎవరైనాపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురిచేసిన, వీధి పిల్లలను, బాల కార్మికులను, పిల్లలు అక్రమ రవాణాకు గురైన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురైన పిల్లలు, బాల్యవివాహాలు నిలుపుదలకై 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ కాల్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల  ద్వారా ఆర్థిక మోసాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ వెంటనే కాల్ చేస్తే కోల్పోయిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు  1930 ద్వారా సైబర్ మోసాల నిరోధించడంతోపాటు, సైబర్ మోసగాళ్లను గుర్తించవచ్చన్నారు. మహిళలకు గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొనే మహిళలు 181 మహిళ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ కి కాల్ చేయాలన్నారు. తద్వారా బాధితులకు తక్షణ సహాయం క్రింద రక్షణతో పాటుగా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అందించబడుతుందన్నారు  విద్యార్థులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ల  పట్ల అవగాహన కలిగి, ప్రతికూల పరిస్థితులలో  అప్రమత్తంగా వ్యవహరించి, పోలీసుల సహాయంతో ప్రమాదం నుంచి రక్షణ పొందాలన్నారు.మండలం లోని పదవ తరగతి పరీక్ష రాస్తున్న  విద్యార్థిని విద్యార్థులు కు పరీక్ష ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ మరియు పెన్నులు ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి. ఎస్ఐ శేఖర్ రెడ్డి కి పాఠశాల విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, నారాయణ  ఉపాధ్యాయులు  మరియు విద్యార్థులు తో పాటు తదితరులు  పాల్గొన్నారు.