పదవ తరగతి విధ్యార్ధులకి పరీక్ష ప్యాడ్స్, స్టేషనరి అందజేసిన జడ్పీటీసీ


యైటీంక్లయిన్ కాలని ఏఫ్రిల్ 01 (జనంసాక్షి) :
పదవతరగతి విధ్యార్ధులకి పరీక్షలు దగ్గరికి సమీపిస్తున్న సంధర్బంగా రామగుండం మల్యాలపల్లి ప్రభుత్వ పాఠశాల, రైల్వేస్టేషన్ లోని లిటిల్ సిటీజన్ ప్రైవేట్ పాఠశాలలోని విధ్యార్ధులకి పరీక్ష ప్యాడ్స్,స్టేషనరీని బి.ఆర్.ఎస్ నాయకులు, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అందజేశారు. శనివారం వివిధ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 3 నుండి జరిగే పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు.పరిక్షలు పూర్తయ్యేవరకు ఎకాగ్రతతో చదివి మంచి ఉత్తీర్ణతని సాధించాలన్నారు.తల్లితండ్రుల కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించి పాఠశాలకి మరియు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేవిధంగా విధ్యార్ధులు కృషి చెయ్యాలన్నారు.
ఎటువంటి చెడు ఆలవాట్లకి లోను కాకుండా విధ్యార్ధులు తమ భవిష్యత్ ను మంచిగా తీర్చిదిద్దుకోవాలన్నారు.
విధ్యార్ధి దశలో ఎవరైతే 25 సంవత్సరాలు కష్టపడతారో వారి జీవితం మిగితా 75 సంవత్సరాలు అనందగా గడుపుతారన్నారు. అదే విధ్యార్ధి దశలో చదువుపై శ్రద్దపెట్టకుండా 25 సంవత్సరాలు ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వారు మిగితా 75 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్ర్రదానోపాద్యాయులు భోగె నాగరాజు, బోగె శ్రీనివాస్, ఉపాధ్యాయిలు రాజేశం, జయరాజ్,వెంకట లక్ష్మీ,స్రవంతి, ఏసు లత, సలీం,ప్రవీణ్,సతీష్ మరియు పూర్వ విధ్యార్ధులు చిలువేరు కుమార్, ఇన్నూస్, శ్రీకాంత్, అభి, తిరుపతి తదితరులు పాల్గోన్నారు.