పదోన్నతల కోసం ఎన్‌కౌంటర్లు చేశారు: సురవరం
హైదరాబాద్: పదోన్నతుల కోసం ఎంతో మంది ఖాకీలు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యాకాండలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు స్పందనను ఆయన సమర్థించారు. 1990నుంచి 2012వరకూ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. భావోద్వేగాలతో తొలిసారి నేరంచేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఆగష్టు 15న విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు సురవరం తెలిపారు. వామపక్షాల పునరేకీకరణపై సీపీఐ సుముఖత వ్యక్తం చేస్తున్నా మొగిలిన పార్టీలు సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు.