పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు:సీఎల్‌పీ

హైదరాబాద్‌:కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సమర్థంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు,కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ శాసససబాపక్షం ఆక్షేపించింది.ఏవైనా తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప పథకాన్ని నీరుగార్చేలా వ్యవహనించడం తగదని ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.పదవిలో ఉండి ఉత్తర్వులు ఇచ్చారు.కాబట్టే ప్రభుత్వం మంత్రులకు న్యాయసహయం ఆందిస్తొందని ఎవరికీ అన్యాయం జరగదని ఆయన తెలిపారు.చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్‌ నడవాల్సిన అవసరం లేదన్న చీఫ్‌ వివ్‌ బీసీలకు వంద సీట్లు ఇస్తానంటున్న బాబు,ముందు పార్టీ అధ్యక్ష పదవి,టీడీఎల్పీ నేత పదవుల్లో ఒకదాన్ని వారికి ఇవ్వాలని గండ్ర డిమాండ్‌ చేశారు.