పన్ను చట్టంలో స్పష్టమైన విధానం : చిదంబరం

ఢిల్లీ: పన్ను చట్టంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా స్పష్టమైన విధానం తీసుకొస్తామని ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో పన్ను ఆదాయం 12 శాతం సాధించటమే లక్ష్యమని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక్ష పన్నుల్లో నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.