పన్నూరులో గర్భిణీలకు సామూహిక శ్రీమంతం
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల అంగాన్వాడి -1 కేంద్రంలో పోషణాపక్షం కార్యక్రమంలో బాగంగా మంగళవారం గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమం అక్షరాభ్యాసం , అన్నప్రసన్న వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగిరి జెడ్పీటీసీ మ్యాధరవేణి శారద కుమార్ , స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్ హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు సల్పాల రమ్య సంపత్ , గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.