పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్‌పై 7న విచారణ
అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ముందస్తు బెయిల్‌పై జిల్లా కోర్టులో ఈ నెల 7న విచారణ చేపట్టనున్నారు. కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికోందరిపై ధర్మవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు ఎమ్మెల్యే సునీత నివాసంతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో శ్రీరామ్ ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు.