పరిశ్రమలతోనే అభివృద్ధి: రోశయ్య

విజయనగరం: పెట్టుబడులు పెరిగి పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో కన్యాకాపరమేశ్వరి అలయం నిర్మాణమై 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రోశయ్యతోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రోశయ్య మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ వ్యాపారల్లో స్థిరపడి జీఎంఆర్‌లా అభివృద్ధిచెందాలని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయనగరంజిల్లా సాలూరు, బొబ్బిలి ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు.