పరిశ్రమలో పేలుతున్న రియాక్టర్లు

గ్రామీణ రణస్థలం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతున్నాయి. పరిశ్రమ ఆవరణలో పొగలు దట్టంగా అలముకున్నాయి. మంటలు మరింత విస్తరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు అగ్నిమాపక వాహనాలు శ్రమస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. డీఎస్పీ ఎల్‌ అర్జున, జిల్లా అగ్నిమాపక అధికారు కృష్ణచైతన్య పర్యవేక్షిస్తున్నారు.