పరీక్షకేంద్రం పేరు తప్పుగా ముద్రించడంతో గ్రూప్‌4 పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 40మంది

హైదరాబాద్‌:
బోడుప్పల్‌: గ్రూప్‌-4 అభ్యర్థులకు పరీక్ష కేంద్రం పేరును అధికారులు తప్పుగా ఇచ్చారు. ఉప్పల్‌ డిపో దగ్గర ఫిర్జాది గూడా లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల చిరునామా ఇవ్వాల్సిన అధికారులు ఘట్‌కేసర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల చిరునామా ఇచ్చారు. వీరు చిరునామా తెలుసుకొని వచ్చే సరికి గంటన్నర సమయం పట్టింది. దీంతో అధికారులు వీరికి పరీక్ష రాసే అనుమతి ఇవ్వలేదు. 40మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశంకోల్పోయారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఎదుట ఆందోళన చేస్తున్నారు.