పల్లెల్లో బీమా బాండ్ల సందడి

ఊరూరా పంపిణీలో నేతలు బిజీ

హైదరాబాద్‌,ఆగస్టు9(జ‌నం సాక్షి ): మొన్నచెక్కుల పంపిణీ… ఇప్పుడు బీమా బాండ్ల పంపిణీతో తెలంగాణ పల్లెల్లో సందడి కనిపిస్తోంది. అధికారులు ఓ వైపు, ప్రజాప్రతినిధులు మరోవైపు పెద్ద ఎత్తున బాండ్లను పంపిణీ చేస్తున్నారు. మరోమారు గ్రామాల్లో జాతర సందడి కనిపిస్తోంది. రైతులు బీమా బాండ్లనుతీసుకోవడానికి కదలి వస్తున్‌ఆనరు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు సామూహిక జీవిత బీమా పథకంతో అన్నదాతల్లో ధీమా కనిపిస్తున్నది. మొదటి రోజు కంటేరెండోరోజు రెట్టింపు పత్రాలను రైతులు అందుకున్నారు. ఏ గ్రామంలో చూసినా రైతులు తమ బీమా పత్రాలను అందుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు బీమా పథకాన్ని అర్హులైన రైతులందరికీ వర్తింప జేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇటీవలే రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు ఎకరానికి రూ.4వేలు పంపిణీ చేశామని, యాసంగిలో మళ్లీ మరో 4వేలు అందజేయనున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలను చూసి యావత్‌ దేశం గర్వంగా తెలంగాణ వైపు చూస్తుందనిఅన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు, దళితబస్తీ ద్వారా భూ పంపిణీ గురించి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15తర్వాత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఇన్ని అభివృద్ధి పథకాలు చేపడుతుంటే జిల్లాలోని ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత కుట్రలు పన్నినా మరో 20 ఏళ్ల రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలో ఉంటారని ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలన్నారు. మరోవైపు ప్రభుత్వం రైతు బీమా పథకం అమలుపై ఊరూరా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుప్రాంతాల్లో రైతులు, టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో రైతుకు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రూ. 5 లక్షల బీమాను ప్రభుత్వం కల్పించడం సంతోషకరమన్నారు. బీమా పథకం అమలుపై ఆనందం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేస్తున్నారు. రైతులకు బీమా చేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులు ప్రమాదశాత్తు మరణించినా, అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నా వారికి నష్టపరిహారం అందక రైతుకుటుంబాలు రోడ్డునపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఈ దుస్థితి ని గమనించిన కేసీఆర్‌ ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టాడని పేర్కొన్నారు.

——————