పస్‌తో ఆడాల్సిందే : ఏఐటీఏ

బెంగుళూరు జూన్‌ 17 :
ఒలింపిక్స్‌ డబుల్స్‌లో ఆడే భారత జోడిని మార్చే ప్రసక్తేలేదని అఖిల భారతటెన్నిస్‌ సమాఖ్య (ఏఐటీ ఏ) తేల్చిచెప్పింది. లియాండర్‌ పేస్‌తో ఆడడాన్ని మహేశ్‌భూపతి వ్యతిరేకిస్తుండడాన్ని దృష్టిలో పె ట్టుకుని ఏఐటీఏ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా భూ పతిజోడి పరిణితితో ఆలోచించాలి వారి మధ్య ఉ న్న విభేదాల కన్నా జాతిప్రయోజనాలు ముఖ్యం. సమాఖ్య మీద ఒత్తిడి తెస్తే జట్టును మార్పుతారని భూపతి అనుకుంటే పొరపాటు అని భారత టెన్ని స్‌ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా అనిల్‌ ఖన్నా తెలి పారు. ప్రస్తుతం ప్రదాన కార్యదర్శిగా కొనసాగు తున్న అనిల్‌ ఖన్నా శనివారం ఓ వార్షిక సాధారణ సమావేశంలో ఏకగ్రీవంగా కొత్త ఆఫీస్‌ బేరర్ల ఎం పిక జరిగింది. ఈ ఎంపికలో గత 12 ఏళ్లుగా బాధ్యతలు చేపట్టారు. ప్రదాన కార్యదర్శిగా భరత్‌ ఓజా, సంయుక్త కార్యదర్శిగా సీఎస్‌ సుందర్‌రా జు, కోశాధికారిగా రక్తిమ్‌ సిఖియా ఎంపికయ్యా రు. ఒలింపిక్స్‌లో లియాండర్‌ పేస్‌తో కలిసి ఆడే సమస్యేలేదని మహేశ్‌ భూపతి అంటున్నా పేస్‌ మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేశాడు. సెలక్షన్‌ కమిటీ ఎవరిని ఎంపిక చేసినా తనకు అ భ్యంతరంలేదని, రోహన్‌ బోపన్నతో కలిసి లండన్‌ ఒలింపిక్స్‌ డబుల్స్‌లో ఆడాలని భూపతి భావిస్తుం డగా భారత టెన్నిస్‌ సమాఖ్య (ఏఐటీఏ) మాత్రం పేస్‌ భూపతితో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భూపతి, లియాండర్‌ పేస్‌తో తాను జత కట్టేదిలేదని నిరసన వ్యక్తం చే శాడు. ఇటీవల మీడియాతో భూపతి చేసిన వ్యాఖ్య లపై నేను స్పందించను. ఏఐటీఏ, సెలక్షన్‌ కమిటీ ఎవరిని ఎంపిక చేసినా వారితో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతకుముందు డబుల్స్‌ భాగ స్వామిగా రోహన్‌ బోపన్నతో కలిసి ఆడాలని అను కుంటున్నాట్టు ఏఐటీఏ అడిగినపుడు చెప్పాను. అతడి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ భారీ సర్సీస్‌లను దృష్టిలో ఉంచుకుని అలా చెప్పాల్సి వచ్చింది. నా కెరీర్‌లో అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం మధురా నుభూతిగా నిలిచింది. జాతీయపతాకం కింద ఒలింపిక్స్‌లో ఆరోసారి భారత్‌ తరపున ఆడడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని పేస్‌ తెలిపాడు. గత నవంబర్‌ నుంచి మా ఇద్దరి మధ్య మాటలు లేవన్నాడు.