పాకిస్తాన్‌ విజయలక్ష్యం 176

పల్లెకెలె: టి-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డిలో బంగ్లాదేశ్‌, పాక్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌ 24, అష్రపుల్‌ 14, అల్‌ హసన్‌ 84, ముష్‌ఫిఖర్‌ రహీమ్‌ 25, మహ్మదుల్లా 0, నసీర్‌ హోస్సన్‌ 16 పరుగులు సాధించగా జియావుర్‌ రహ్మన్‌ 1 పరుగుతో నటౌట్‌గా మిగిలాడు. పాక్‌ బౌర్లులో అరాఫత్‌ 3, తన్వీర్‌, అఫ్రిదీలు చెరో వికెట్‌ సాధించారు.