పాక్‌పై భారత్‌ జోరు

బీజింగ్‌ : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. ఈరోజు మరో పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల స్క్వాష్‌ విభాగంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ విజయం సాధించగా.. స్క్వాష్‌లో తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. కీలక రౌండ్‌లో భారత్‌ ప్లేయర్‌ అభయ్‌ సింగ్‌ చివరి వరకూ పోరాడి గెలిపించాడు. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 36 పతకాలుండగా.. ఇందులో 10 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్య పతకాలున్నాయి. మొత్తంగా పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

తాజావార్తలు