పాక్‌లో కారు బంబు పేలి 10 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లొని పెషావర్‌ నగర సరిహద్దులో ఒక కారు బాంబు పేలి 10 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన వ్యాన్‌ లక్ష్యంగా రిమోట్‌తో ఈ బాంబు పేల్నినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. మృతుల్లో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది ఉన్నదీ లేనిదీ కచ్చితంగా తెలియలేదు. బాధితులను స్థానికులు వేర్వేరు వాహనాల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది.