పాక్‌లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు…45 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 45 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కరాచీలోని హబ్‌రివర్‌ రోడ్‌లోని ఓ వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన ఫ్యాక్టరీలో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ప్యాక్లరీలోనే చిక్కుకుపోయారు. లాహోర్‌లోని ఓ షూ ప్యాక్టరీలో జరిగిన మరో ఆగ్నిప్రమాదంలో 25 మంది కార్మికులు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.