పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు జైషే ఝలక్‌

ఉగ్రదాడి తమపనేనంటూ వీడియో విడుదల
లా¬ర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు జైషే మహమ్మద్‌ గట్టి ఝలక్‌ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ జైషే రెండో వీడియోను మంగళవారం విడుదల చేసింది. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని వీడియోలో పేర్కొనడం గమనార్హం.
ఇమ్రాన్‌ ఖాన్‌ మంగళవారం విూడియా సమావేశం నిర్వహించి.. పుల్వామా ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని భారత్‌ వాదనలను కొట్టిపడేశారు. తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోయారు. తమపై నిందలు వేస్తున్న భారత్‌.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరడం విశేషం. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జైషే… దాడులు తమ పనే అంటూ రెండో వీడియో విడుదల చేసింది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించి.. భారత్‌కు మద్దతుగా నిలిచాయి. అయితే  భారత్‌ ఆరోపణలు ఖండించిన ఇమ్రాన్‌కు ఇప్పుడు జైషే వీడియోతో గొంతులో వెలక్కాయ పడ్డట్లుగా అయ్యింది.