పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడల్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన బీవో నెంబరు 63 ప్రకారం రాజధాని హైదరాబాద్‌లోని పాఠశాలల్లో క్రీడల కోసం ఓ పిరియడ్‌ను తప్పనిసరి చేయటంతో పాటు వరుస టోర్నమెంట్ల ద్వారా పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు సర్కారు సద్ధమవుతోంది. దీనికోసం బుధవారం నుంచి నెలరోజులపాటు 33 విభాగాల్లో టోర్నీ నిర్వహించనుంది. దీంతో పాటు ఈ ఏడాది స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ను విద్యాశాఖాధికారులు విడుదల చేశారు.