పాఠశాలల స్థాయి పెంపు

శ్రీకాకుళం, జూలై 20: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో 94 ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతిని శుక్రవారం నాడు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 581 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 92 పాఠశాలలకు స్థాయి పెంచారు. 6,7 తరగతుల్లో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య 40కి తగ్గకుండా ఉండి ఈ పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలో లేనివాటినే పదోన్నతులకు ఎంపిక చేశారు. ఈ విషయమై రాజీవ్‌ విద్యామిషన్‌ పీవో నగేష్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలకు సౌకర్యాలు కల్సిస్తామని అన్నారు.