పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థిని దుర్మరణం..!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా, నలుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. 

ఈ బస్సు దుగ్గిరాల మండలం శృంగారపురం నుండి విద్యార్థులను తీసుకు వస్తుండగా నూతక్కి – కొత్తపాలెం రహదారిలో ప్రమాదవశాత్తూ తాటిచెట్టు మొద్దును ఢీకొట్టింది. బస్సులోకి దూసుకు వచ్చిన తాటిమొద్దు తగిలి విద్యార్థిని లహరి అక్కడికి అక్కడే మృతి చెందింది. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు