పాతబస్తీ పరిస్థితిపై హోంమంత్రి సమీక్ష
హైదరాబాద్: నగరంలోరి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఆవేశాలకు లోను కావొద్దన్నారు. శాంతి, మత సామరస్యాలకు ప్రతీకగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మక్కామసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం అల్లరిమూకలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. బైకులను, షాపులను ధ్వంసం చేశారు. పోలీసులు, జర్నలిస్టులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అల్లరిమూకలపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు.



