పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు
అనంతపురం: జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుపోరుబాటకు ఇప్పటి యాత్రకు తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. నిద్రలేమి వల్ల అలసటగా ఉందని, ప్రజల కోసం ఎంత బాధనైనా భరిస్తానని చంద్రబాబు అన్నారు.