పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలి..

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 24
తెలంగాణలో పారిశుధ్య కార్మికుల, కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బిజెపి పట్టి మండల అధ్యక్షుడు కేశవపట్నం ఎంపీటీసీ 2 ఏనుగుల అనిల్ అధికారులను కోరారు. శుక్రవారం బిజెపి పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మండల ఎంపీడీవోకు అవినీతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు.గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించడంతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులను ,రెగ్యులరైజేషన్ చేసి, వేతనం పెంచాలని, ఎస్సీ మోర్చా బిజెపి మండల శాఖ శంకరపట్నం ప్రధాన కార్యదర్శి సందెల రంజిత్, ఆ సేధ్వర్యంలో ఎంపీడీవో కాజాబషిరోద్దిన్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు జైపాల్, రాజిరెడ్డి, ప్రధానకార్యదర్శి సంపత్, నరేందర్, మండల కార్యదర్శి రాజేందర్ మండల ఉపాధ్యక్షులు అర్జున్, రాజిరెడ్డి ఎస్ టి మోర్చా అధ్యక్షులు సారయ్య సీనియర్ నాయకులు, శివారెడ్డి, మహేందర్ రెడ్డి, రవిందర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.