పార్థసారధిని వెంటనే భర్తరఫ్‌ చేయాలి, కళంకిత మంత్రులను తొలగించాలి : టీడీపీ

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నీతినీజాయితి ఉంటే కళింకిత మంత్రులను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేత కడీయం శ్రీహీరి అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు శిక్ష గురవుతున్న మంత్రి పార్థసారధిని వెంటనే భర్తరఫ్‌ చేయలని సీఎంను కోరారు. రాష్ట్ర కేబినేట్‌ సమావేశాలు చర్లపేల్లి జైల్లో జరిగే రోజుతు దగ్గర్లోనే ఉన్నయని ఆయన ఎద్దేవ చేశారు. మంత్రులంతా జైల్లో చేరితే సీఎం అక్కడే కేబినేట్‌ సమావేశాలు పెట్టాల్సి వస్తుందని తెలిపారు.