-->

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో గంధం చంద్రయ్య మృతిచెందగా వారి పార్థివ దేహానికి సోమవారం ఎఐసిసి కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ , మండల పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య, పన్నూరు ఎంపిటిసి చిందం మహేష్, మాజీ ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.