దేశ్‌ముఖ్‌ మృతికి సంతాపంగా ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: అనారోగ్య కారణంగా మృతి చెందిన కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌  నేత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఘనంగా నివాళులు ఆర్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లోటు పూడ్చలేనిదని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం సంతాపసూచకంగా ఉభయసభలను రేపటికి వాయిదావేశారు.