పార్లమెంట్‌ను స్తంభింపజేస్తం: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను అడ్డుకుంటామని అయన హెచ్చరించారు.