పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధం : కమల్‌ నాథ్‌

న్యూఢిల్లీ : డీఎంకే మద్ధతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మనుగడపై ఎలాంటి అనుమానాలు లేవని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని చెప్పారు. పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధమని తెలిపారు. యూపీఏ ద్వారాలు తెరిచే ఉన్నాయని … ఎవరు మద్దతిచ్చిన్నా అంగీకరిస్తామని అన్నారు. శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంట్‌లో తీర్మానంపై పార్టీలను సంప్రదిస్తున్నామని వెల్లడించారు.