పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి)
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ, భువనగిరి స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రెండవ స్థానంలో బిజెపి పార్టీ ఉంటుందన్నారు.నల్లగొండ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలలో 74.02 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లతో పాటు మరో ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహనరెడ్డి, బైరు ప్రసాద్, జులకంటి సైదిరెడ్డి, బొజ్జ శంకరయ్య, గాలి నాగరాజు తదితరులు ఫాల్గున్నారు.