పాలకొండ ఆర్డీవో బదిలీ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో పాలకొండ ఆర్డీవో వెంకటేశ్వర రావును బదిలీ చేశారు. పాలకొండ కొత్త ఆర్డీవోగా దయానిదిని నియమించారు. ఇదే ఘటనకు సంబంధించి వంగ తహశీల్థార్‌ ఎ.సింహాచలాన్ని సస్పెండ్‌ చేశారు. రాజాం తహశీల్థార్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు.