పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరులో విషాద సంఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లిలో పిడుగుపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.