……..పిల్లలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి ……..
జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 23:మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అరూరు గ్రామంలో గల పలు అంగన్వాడి కేంద్రాలలో శుక్రవారం మహాసభలను నిర్వహించారు.స్థానిక జెడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బాలింతలకు గర్భిణీలకు పసిపిల్లలకు సమతుల్య ఆహారం అందించాలని ప్రతినెల వారి బరువును పరిశీలించుకోవాలని ఆరు నెలల పిల్లలకు మంచి ఆహారం అందించాలని ఆమె అన్నారు.ఎత్తులోపం ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు తగు వైద్య సదుపాయాన్ని అందించాలని ఆమె అన్నారు.అంగన్వాడి కేంద్రాలలో అందించే ఆహార పట్టికను పరిశీలించారు.ఆరునెలల సామాజిక వేడుకలలో భాగంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి అంగన్వాడీ టీచర్లు బాలవిజయ,సబితా,నాగమణి,సౌజన్య, ఆయాలు,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.