పీఆర్‌ టెండర్లలో దౌర్జన్యం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నయోజరవర్గం కూసుమంచి మండలంలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో తొమ్మిది సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టెండర్లలో అధికారపార్టీ నేతల అనుచరులు దౌర్జన్యానికి దిగారు. అయితే వీరి ప్రయత్నాలు ఫలించలేదు. అధికారులు నిర్ణయించారు. మొదట టెండరు ధాఖలు చేసిన కాంట్రాక్టర్లు 3 గంటల సమయంలో బాక్సుకు సీల్‌ వేయాలని అధికారులను కోరారు. సీల్‌వేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులను అధికారపార్టీ వర్గీయులు కొందరు బలవంతంగా నెట్టేసి బాక్సుకు వేసిన సీల్‌ను తొలగించి వారి టెండర్‌ షెడ్యూళ్లను బాక్స్‌లో వేశారు. దీనిపై మిగిలిన గుత్తేదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు 4 గంటలకు కార్యాలయానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.