పీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నాహాలు

చెన్నై : సీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నా:హాలు జరుగుతున్నాయని ‘ఇస్రో’ ఛైర్మన్‌ డాక్టర్‌ కె. రాధాకృష్ణన్‌ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాల సహకారంతో దీనిని వచ్చే నెల రెండో వారంలో ప్రయోగించనున్నామని పేర్కొన్నారు. దీంతో దేశ శాట్‌లైట్‌ రంగంలో ఇప్పటి వరకు ప్రయోగించినవి వందకు చేరుకుంటాయని సంతోషం వ్యక్తం చేశారు.