పీవీ జయంతి సందర్భంగా నేతల నివాళులు

హైదరాబాద్‌:  మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఈరోజు పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు తెలుగువారు కావడం మన అదృఫ్టమని వారు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, పీవీ కుటుంబసభ్యులు  నెక్లెస్‌ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో శ్రద్దంజలి ఘటించారు.