పీసెట్‌ ప్రవేశాలకు 6 కళాశాలలు కేటాయింపు

గుంటూరు: అక్టోబరు 1 నుంచి 3 వరకూ పీసెట్‌ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పీసెట్‌ కనీత్వనర్‌ పాల్‌ తెలిపారు. అక్టోబరు 5న సీట్ల కేటాయింపు, 8,9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. అక్టోబరు 11 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.