పీహెచ్‌సీని తనిఖీ చేసిన రీజినల్‌ డైరెక్టర్‌

మామడ: మామడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ సుభద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల అందుబాటు, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా మలేరియా అధికారి రవి, పలువురు వైద్యులు ఉన్నారు.